TG: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో ఇద్దరు అభిమానులు, మహిళ, ఓ బాలుడు సొమ్మసిల్లి పడిపోవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.