సత్యసాయి బాబా 100వ జయంతి (శత జయంతి) ఉత్సవాల్లో పాల్గొనేందుకు బాలీవుడ్ స్టార్, మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య బచ్చన్ పుట్టపర్తికి విచ్చేశారు. సాయి బాబా సన్నిధిలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఐశ్వర్యను చూసేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి కనబరిచారు. బాబాపై ఉన్న భక్తితో ఆమె తరచుగా పుట్టపర్తికి వస్తుంటారు.