హైదరాబాద్ శివారు చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ క్షేత్రం 128 ఎకరాలలో విస్తరించి ఉంటుందని అధికారులు తెలిపారు. వ్యవసాయంతో పాటు, కూరగాయలు, పండ్ల తోటలు, నర్సరీ, తేనెటీగలు, చేపలు పెంపకం, అడ్వెంచర్ పార్క్, యోగ కేంద్రం వంటివి అందుబాటులో తెచ్చారు. రోజుకు 30 నుంచి 40 మంది ఖైదీలు ఇందులో పనిచేస్తున్నట్టుగా పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా జైలు సిబ్బంది వ్యవసాయంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.