NZB: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు, వాటికి బానిస కావడం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు.