WGL: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు నషా ముక్త భారత్ అభియాన్లో భాగంగా విద్యార్థులచే డ్రగ్స్ నిర్మూలనపై సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు వివరించారు.