బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ-2’ సినిమా నుంచి ‘జాజికాయ’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. మన సత్తా ఏంటో ముంబైలో చూపించాం.. ఇంట గెలిచి, అక్కడ రచ్చ రచ్చ చేశామని పేర్కొన్నారు. ఆ ప్రేక్షకులు పాటను ఆదరించారని.. ఇప్పుడు రెండో పాటను ఇక్కడ విడుదల చేశామని చెప్పారు. అలాగే, సంయుక్త అద్భుతంగా నటించారని, ఆమె పోషించిన పాత్ర అలరిస్తుందని తెలిపారు.