TG: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు మరో ప్రమాదం జరిగింది. HYDలోని పెద్ద అంబర్పేట్ వద్ద బస్సులో పొగలు వచ్చాయి. బస్సు ఓవర్ హీట్‌తో టైర్ల నుంచి పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. HYD నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చలిలో 26 మంది ప్రయాణికులు రోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు. ఇంకా ట్రావెల్స్ యాజమాన్యం స్పందించకపోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు.