ఈనెల 22 నుంచి గౌహతిలో భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ టెస్టు కాస్త విభిన్నంగా ఉండనుంది. సాధారణంగా ఏ టెస్టు మ్యాచ్‌లోనైనా లంచ్ బ్రేక్ తర్వాత టీ విరామం ఉంటుంది. కానీ, రెండో టెస్టులో తొలుత టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత భోజన విరామం ఉంటుంది. పగటిపూట జరిగే టెస్టుల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. గౌహతిలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ మార్పులు చేశారు.