VSP: భీమిలి సమీపంలోని కొత్తవలసలో స్థల వివాదానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. కోరాడ అప్పలరాజు అనే వ్యక్తిపై శ్రీను అనే వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అప్పలరాజును ఆసుపత్రికి తరలించారు. శ్రీనుని అదుపులోకి తీసుకున్న భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.