రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్లో భారత్-A జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 135/7 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని హర్ష్ దూబే అర్థ సెంచరీతో రాణించడంతో భారత్ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(12) నిరాశపరిచాడు.