హీరో అక్కినేని నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకకు అన్నపూర్ణ స్టూడియోస్ వేదికైంది. ఇరు కుటుంబసభ్యుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, టీ సుబ్బిరామి రెడ్డి, రానా దగ్గుబాటి, సుహాసిని, అడవి శేష్, అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, దర్శకులు కళ్యాణ్ కృష్ణ, శశికిరణ్, చందు మొండేటి తదితరులు హాజరయ్యారు.