• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘ఉస్తాద్’ ఈవెంట్ ఎఫెక్ట్.. నటుడి కీలక నిర్ణయం

తమిళ నటుడు, దర్శకుడు పార్థిబన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వేడుకలో పొరపాటున తన కులం పేరు వాడటంతో వచ్చిన విమర్శలపై ఆయన స్పందించాడు. మాతృభాష తెలుగు అని చెప్పే క్రమంలో మాట జారానని, తనకు కులమతాల పట్టింపు లేదని స్పష్టం చేశారడు. అందుకే ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశానని, దీనిపై సామాజిక అవగాహన కల్పిస్తానని ప్రకటించాడు.

March 28, 2026 / 09:07 AM IST

చెల్లెలు నిహారిక ప్రొడక్షన్‌లో వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ తన తర్వాత సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ యదు వంశీతో చేయనున్నారు. ‘బరి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ పల్లెటూరి నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. నిహారిక కొణిదెల నిర్మిస్తుండటం విశేషం. పవన్ ముఖ్య అతిథిగా నేడు పూజా కార్యక్రమం జరగనుంది. 2027 సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్టోరీని వివరించడానికి AI వీడియోను యూనిట్ ప్లాన్ చేస్తోంది.

March 28, 2026 / 08:19 AM IST

వరుణ్‌తో నిహారిక మూవీ.. పోస్టర్ రిలీజ్

వరుణ్ తేజ్ తన తర్వాత సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ యదు వంశీతో చేయనున్నారు. ‘బరి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ పల్లెటూరి నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. నిహారిక కొణిదెల నిర్మిస్తుండగా.. తాజాగా చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాను 2027 సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్టోరీని వివరించడానికి AI వీడియోను యూనిట్ ప్లాన్ చేస్తోంది.

March 28, 2026 / 08:19 AM IST

మార్చి 28: టీవీలలో సినిమాలు

స్టార్ మా: F-2(7AM), టిల్లు స్క్వేర్(3.30PM); జీతెలుగు: అందాల రాముడు(4.30PM); జెమిని: గబ్బర్ సింగ్(9AM), ఆంజనేయులు(3:30PM), హార్ట్ ఎటాక్(10.30PM); స్టార్‌మా మూవీస్: సప్తగిరి LLB(7AM), ప్రతిరోజూ పండగే(9AM),బాహుబలి 1(12PM), భీమా(3PM), పుష్ప(6PM), ఆదికేశవ(10PM); జీ సినిమాలు: కురుక్షేత్రం(7AM), రంగ రంగ వైభవంగా(9AM), మిడిల్ క్లాస్ మెలోడీస్(12PM), ఉన్నది ఒకటే జిందగీ(3PM).

March 28, 2026 / 04:29 AM IST

ప్రభాస్‌కు తల్లిగా నటించను: రాశి

ప్రభాస్‌తో నటించడంపై తాను చేసిన వ్యాఖ్యలపై రాశి క్లారిటీ ఇచ్చింది. తాను ప్రభాస్‌కు తల్లిగా మాత్రమే నటించనని చెప్పానని తెలిపింది. సోదరి పాత్రకు తాను సిద్ధమేనని ‘అనుమాన పక్షి’ మూవీ ఈవెంట్‌లో స్పష్టం చేసింది. ప్రభాస్‌తో కలిసి నటించాలన్న తన కల అలాగే మిగిలిపోయిందని పేర్కొంది. మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించిది.

March 27, 2026 / 09:46 PM IST

కిల్లి కృపారాణి కుమారుడు హీరోగా ఎంట్రీ

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతి కుమార్ ‘శ్రీ మహావిష్ణు’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో అనైరా గుప్తా, దీప్శిఖ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరి హరన్ గడగని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ చిత్రంతో క్రాంతి కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

March 27, 2026 / 08:49 PM IST

చరణ్‌కు బన్నీ బర్త్ డే విషెస్

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ‘నా ప్రియమైన రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు పెద్ద విజయం మాత్రమే కాదు.. ‘పెద్ది’ వంటి భారీ విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ప్రచారానికి తెర పడింది.

March 27, 2026 / 05:59 PM IST

అచ్చం నాన్న పోలికే: ఉపాసన

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడి చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ ఫొటోలు చూసిన చరణ్ భార్య ఉపాసన చేసిన కామెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమ చిన్న కుమార్తె అన్వీరా అచ్చం తండ్రి (రామ్ చరణ్) లాగే ఉంటుందని ఉపాసన పేర్కొంది. కాగా, చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకారా తర్వాత కవలలు శివరామ్, అన్వీరా జన్మించారు.

March 27, 2026 / 05:47 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నటుడు కీలక విజ్ఞప్తి

నటుడు రాహుల్ రామకృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక విజ్ఞప్తి చేశాడు. ప్రమాదకరమైన ‘పారాక్వాట్’ అనే గడ్డి మందును వెంటనే నిషేధించాలని విజ్ఞప్తి చేశాడు. మార్కెట్లో సులభంగా దొరుకుతున్న ఈ విష రసాయనం కారణంగా.. తన సోదరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఆత్మహత్యలకు సులభమైన మార్గంగా మారిందని చెబుతూ.. ‘X’ వేదికగా సీఎం, ప్రధాని కార్యాలయాలకు విన్నవించాడు.

March 27, 2026 / 05:38 PM IST

నాగార్జునతో జత కట్టనున్నఐశ్వర్య రాజేష్!

అక్కినేని నాగార్జునతో నటి ఐశ్వర్య రాజేష్ జత కట్టనున్నట్లు తెలుస్తోంది. నాగ్, తమిళ దర్శకుడు రా. కార్తీక్ కాంబోలో ‘కింగ్ 100’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఐశ్వర్య కథానాయికగా నటించనుందట. ఈ మేరకు ఆమెను మేకర్స్ సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే ఐశ్వర్య సెట్స్‌లో జాయిన్ కానున్నట్లు టాక్.

March 27, 2026 / 04:56 PM IST

‘ధురంధర్ 2’ వివాదం.. ద‌ర్శ‌కుడి ఫైర్

‘ధురంధర్ 2’ చిత్రంపై సెన్సార్ బోర్డ్ ఆంక్షలను నటుడు, దర్శకుడు దీపక్ తిజోరి తీవ్రంగా విమర్శించాడు. ‘A’ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా బూతు పదాలను మ్యూట్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. థియేటర్లలో కోతలు విధించి, అవే సినిమాలను OTTలలో అన్‌కట్‌గా వదలడం సెన్సార్ బోర్డ్ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఫైరయ్యాడు. ఈ వివక్ష ఎవరిని రక్షించడానికని సూటిగా ప్రశ్నించాడు.

March 27, 2026 / 04:26 PM IST

OFFICIAL: ‘హే బల్వంత్’ OTT డేట్ ఫిక్స్

టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా దర్శకుడు గోపి అచ్చెర తెరకెక్కించిన ‘హే బల్వంత్’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT డేట్ ఖరారైంది. ప్రముఖ OTT సంస్థ జీ5లో మార్చి 31 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తన తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా  తీసుకోవాలనుకునే యువకుడి కథతో ఈ సినిమా రూపొందింది.

March 27, 2026 / 04:20 PM IST

నిర్మాతగా రామ్ సోదరుడి ఎంట్రీ

హీరో రామ్ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అతడు నటుడిగా కాకుండా నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నారని సమాచారం. రామ్ హీరోగా నటించబోయే తదుపరి చిత్రాన్ని కృష్ణ స్వయంగా నిర్మించబోతున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

March 27, 2026 / 04:02 PM IST

‘రాకాస’ ప్రమోషన్స్‌లో నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం ‘రాకాస’ వచ్చే నెల 3న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిహారిక.. చిరంజీవి ‘అంజి’ చిత్రంలో తాను ఓ పాత్రలో నటించినట్లు తెలిపింది. ‘ఆ సినిమాలో ఒక చిన్న పాప పాత్ర కోసం నన్ను తీసుకున్నారు. అప్పుడు నాకు సరిగ్గా మాటలు కూడా రావు. అయితే సినిమా కథలో మార్పులు జరగడం వల్ల నా స్థానంలో వేరే వాళ్లను తీసుకున్నారు’ అని చ...

March 27, 2026 / 03:43 PM IST

వరుణ్ తేజ్‌తో నిహారిక మూవీ.. ముహూర్తం ఫిక్స్

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో వరుణ్ తేజ్ ఓ క్రేజీ ప్రాజెక్టు చేయనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు యాదు వంశీ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 28, 2026న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా రాబోతున్నట్లు సమాచారం.

March 27, 2026 / 03:32 PM IST