రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ‘నా ప్రియమైన రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు పెద్ద విజయం మాత్రమే కాదు.. ‘పెద్ది’ వంటి భారీ విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ప్రచారానికి తెర పడింది.