నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం ‘రాకాస’ వచ్చే నెల 3న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిహారిక.. చిరంజీవి ‘అంజి’ చిత్రంలో తాను ఓ పాత్రలో నటించినట్లు తెలిపింది. ‘ఆ సినిమాలో ఒక చిన్న పాప పాత్ర కోసం నన్ను తీసుకున్నారు. అప్పుడు నాకు సరిగ్గా మాటలు కూడా రావు. అయితే సినిమా కథలో మార్పులు జరగడం వల్ల నా స్థానంలో వేరే వాళ్లను తీసుకున్నారు’ అని చెప్పింది.