హీరో రామ్ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అతడు నటుడిగా కాకుండా నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నారని సమాచారం. రామ్ హీరోగా నటించబోయే తదుపరి చిత్రాన్ని కృష్ణ స్వయంగా నిర్మించబోతున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.