కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతి కుమార్ ‘శ్రీ మహావిష్ణు’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో అనైరా గుప్తా, దీప్శిఖ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరి హరన్ గడగని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ చిత్రంతో క్రాంతి కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.