WGL: రాయపర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఎస్సై ముత్యం రాజేందర్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపవద్దని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.