చిత్తూరులో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి మహోత్సవ బైక్ ర్యాలీని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం కొంగారెడ్డి పల్లి, శాంతినగర్ కాలనీలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి ర్యాలీని ప్రారంభించి సొంతంగా బైక్‌ని నడిపారు. నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.