MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ రామ మందిరం ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గంట సంజీవ రెడ్డి, కేసముద్రం మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ డా. రమ-నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.