TG: దక్షిణ అయోధ్య భద్రాద్రిలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి రామయ్యకు కళ్యాణం జరిగిన వేదిక పైనే రేపు మహా పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల పాల్గొని, స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, ఇవాళ భద్రాద్రి రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.