జమ్ముకాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ రూ.8.40 కోట్ల భారీ ధరతో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున IPLలో అరంగేట్రం చేయబోతున్నాడు. కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీని DC దక్కించుకుంది. వేలం రోజున తన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారని నబీ తెలిపాడు. IPLలో భారీ ధర పలికినప్పటికీ, తన లక్ష్యం మాత్రం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడమేనని అతడు స్పష్టం చేశాడు.