NLG: ఊరి కుక్కల దాడిలో దుప్పి మృతి చెందిన సంఘటన మర్రిగూడ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తానేదారుపల్లి గ్రామ శివారులో ఉన్న గుట్ట పరిసర ప్రాంత వ్యవసాయ భూముల్లో దుప్పిలు మందగా సంచరిస్తుండగా ఊరి కుక్కలు తరమడంతో పరిగెత్తాయి. ఈ నేపథ్యంలో ఫెన్సింగ్‌కు తాకి దుప్పి మృతి చెందింది. సర్పంచ్ నరసింహ ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పగించారు.