నటుడు రాహుల్ రామకృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక విజ్ఞప్తి చేశాడు. ప్రమాదకరమైన ‘పారాక్వాట్’ అనే గడ్డి మందును వెంటనే నిషేధించాలని విజ్ఞప్తి చేశాడు. మార్కెట్లో సులభంగా దొరుకుతున్న ఈ విష రసాయనం కారణంగా.. తన సోదరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఆత్మహత్యలకు సులభమైన మార్గంగా మారిందని చెబుతూ.. ‘X’ వేదికగా సీఎం, ప్రధాని కార్యాలయాలకు విన్నవించాడు.