తమిళ నటుడు, దర్శకుడు పార్థిబన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వేడుకలో పొరపాటున తన కులం పేరు వాడటంతో వచ్చిన విమర్శలపై ఆయన స్పందించాడు. మాతృభాష తెలుగు అని చెప్పే క్రమంలో మాట జారానని, తనకు కులమతాల పట్టింపు లేదని స్పష్టం చేశారడు. అందుకే ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశానని, దీనిపై సామాజిక అవగాహన కల్పిస్తానని ప్రకటించాడు.