BDK: భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ మిథిలా మైదానంలో శ్రీరాముడికి పట్టాభిషేకం కార్యక్రమం జరగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మహాపట్టాభిషేకం వేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరుకానున్నారు.