TG: విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ‘గురుకులాల్లో ఐఐటీ, జేఈఈ, ఎంసెట్‌కు శిక్షణ ఇస్తున్నాం. గురుకులాల్లో చదువుకుని అనేకమంది ఉన్నత స్థానాలకు వెళ్లారు. మౌలిక వసతులు పెంచుతున్నాం. ఆత్మగౌరవ భవనాల పేరుతో.. విద్యార్థుల కోసం వంద సమీకృత హాస్టళ్లు నిర్మిస్తున్నాం’ అని వెల్లడించారు.