TG: పంచాయతీ రాజ్ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం వంటివి గ్రామీణ పేదలకు మేలు చేసేలా చట్టాలను తెచ్చామని తెలిపారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిందని ఆమె స్పష్టం చేశారు.