AP: 2014లో విభజన నష్టాన్ని పూడ్చడం కేవలం చంద్రబాబు వల్లే సాధ్యమని నమ్మి ప్రజలు టీడీపీని గెలిపించారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం పనిచేశారని, గతంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని జిల్లాల అభివృద్ధి జరుగుతోందని అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో చంద్రబాబు అనుభవం కీలక పాత్ర పోషించిందని ఆయన కొనియాడారు.