TG: మంత్రి పొంగులేటిని బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం బ్లాక్ మెయిల్‌లకు తలొగ్గదని స్పష్టం చేశారు. ఇసుక మాఫియా, అక్రమాలకు పాల్పడింది బీఆర్ఎస్ నేతలు, వారి బంధువులే అని తెలిపారు. రాఘవ కన్స్ట్రక్షన్కు పొంగులేటికి సంబంధం లేదన్నారు. తాము నిజాయతీగా పనిచేస్తూ మైనింగ్ ఆదాయం పెంచామన్నారు.