KKD: సామర్లకోట కొత్తూరు వీధిలో శనివారం మధ్యాహ్నం మలిరెడ్డి సూర్యకాంతం అనే మహిళ ఇంటిలో దొంగలు పడి చోరీకి పాల్పడ్డారు. మహిళ మెడలో ఉన్న నగలు, చేతికి ఉన్న గాజులు లాక్కొని పారి పోయారు. మహిళ చోరీ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు వివరించారు. స్థానిక కౌన్సిలర్ బలుసు వాసు చోరీ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.