అన్నమయ్య: మదనపల్లిలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ విద్యాసంస్థలు జీరో వేస్ట్ కేంద్రాలుగా మారాలని పిలుపునిచ్చారు. వ్యర్థాలను తడి, పొడి, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్‌గా వేరు చేసి సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు శుభ్రత సందేశాన్ని సమాజానికి తీసుకెళ్లి ప్రతి ఇంటిని కూడా జీరో వేస్ట్ కేంద్రంగా మార్చాలని ఆకాంక్షించారు.