RR: నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో మహిళా భవనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజమ్మ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని,మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. మహిళల సాధికారత కోసం ఇలాంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని గ్రామస్తులు పేర్కొన్నారు.