PPM: అసలు టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు ఇచ్చే ఆలోచన ఉందా..? అని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ డీసీసీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలి నాయుడు తదితరులు పార్వతీపురం మండలం అడ్డాపు శీల గ్రామంలో టిడ్కో గృహాలను పరిశీలించారు. తొమ్మిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఇళ్లు పంపిణీ చేయకపొవడం దారుణం అన్నారు.