SKLM: ఆమదాలవలస మండలం వంజంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు ఉషారాణి పిలుపునిచ్చారు. శనివారం విద్యాకమిటి ఛైర్పర్సన్ రాధికతో కలిసి ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బడుల్లో విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.