MDK: నార్సింగ్ మండలం నర్సంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను గ్రామస్థులు ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నర్సంపల్లి సీసీ రోడ్డు పనులకు రూ. 25 లక్షలు మంజూరయ్యాయి. శనివారం గ్రామంలో పూజలు నిర్వహించి సీసీ రోడ్డు పనులను సర్పంచ్ కొండాపురం భాగ్యలక్ష్మి రాజేశ్వర్ గౌడ్ పనులను ప్రారంభించారు.