JGL: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం టికెట్లు రూ. 1,42,364, ప్రసాదాలు రూ. 1,22,000, అన్నదానం రూ. 21,301గా మొత్తం రూ. 2,85,665 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.