JGL: నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మల్లాపూర్‌లోని ముత్యంపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఆర్థికపరమైన సమస్యలు ఉంటే ఐకేపీ, సహకార సంఘాల ద్వారా రుణాలు పొందాలన్నారు. లబ్ధిదారులకు దశలవారీగా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోనే బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలిపారు.