MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సీపీ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ఘనంగా సత్కరించారు. ఎస్సై అంజయ్య, ఏఎస్సైలు ఎం. వెంకటస్వామి, సయ్యద్ రాయిస్ అహ్మద్‌లను పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కుటుంబ క్షేమం కన్నా సమాజ క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమే అన్నారు.