KNR: పోలీసుల సమస్యలపై శనివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించే సిబ్బందికి రావాల్సిన సరెండర్ లీవ్స్, టీఏ, డీఏ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు అందక పోలీస్ సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరారు.