MHBD: కక్షిదారులు లోక్ అదాలత్ విధానాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలని డీఎస్పీ తిరుపతిరావు సూచించారు. ఇవాళ పట్టణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.