WNP: శ్రీరంగాపూర్ మండల పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తాలో ఎస్సై హిమబిందు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మధు, శ్రీను, శివాని తదితరులు పాల్గొన్నారు.