కడపలో జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద శనివారం సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించడంలో జిల్లా పరిషత్ విఫలమైతే ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.