JGL: గొల్లపల్లి మండలంలోని తిరుమలాపూర్లోని శ్రీ గుండు మల్లన్న స్వామి వారి ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎడ్ల బండ్ల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం స్వామివారి పల్లకి శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. సర్పంచ్ క్యాస అంజలి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.