AP: అమరావతి రాజధానిగా చట్టసవరణకు.. ఏప్రిల్ 1న కేంద్రం ఆమోదం పొందే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందేందుకు పంపించామన్నారు. పార్లమెంట్ ఆమోదించాక రాష్ట్రమంతా వేడుకలు నిర్వహిస్తామన్నారు. అమరావతి నాది అనే భావన ప్రజలందరిలో కలిగేలా స్ఫూర్తి నింపే కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇలాంటి చారిత్రాత్మక చర్చలో పాల్గొనడం జగన్ బాధ్యత అన్నారు.