W.G: వచ్చే నెల ఏప్రిల్ 4న పెనుమంట్ర మండలం మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో ‘మారుతున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులు, సుస్థిర వరి వ్యవసాయం’ అనే అంశంపై కిసాన్ మేళాను నిర్వహిస్తున్నట్లు సంస్థ సహా సంచాలకులు టీ. శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణలు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.