ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న పంటలకు ఏప్రిల్ చివరి వరకు సాగర్ జలాలు విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. శనివారం వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అనేక మండలాల్లో వరి పంట ఏప్రిల్ చివరి వరకు ఉండే అవకాశం ఉందన్నారు. సాదాబైనామాదరఖాస్తులు పరిష్కరించాలని కోరారు.