ATP: టెక్నాలజీని ప్రజల రక్షణ, వ్యవస్థల బలోపేతం కోసం వాడాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ‘అనంతపురం పోలీస్ ఏఐ హ్యాకథాన్ 2026’ గ్రాండ్ ఫినాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. AI రంగంలో విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోనే మొదటి సారిగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.