PDPL: పెద్దపల్లి సర్కిల్లో వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం సన్నద్ధం చేసినట్లు SE గంగాధర్ తెలిపారు. లోడ్ అధిక ప్రాంతాల్లో 110 నియంత్రికలు ఏర్పాటు చేసి, 13 సబ్జెస్టేషన్లలో ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. అంతరాయాల నివారణకు ఇంటర్ లింకింగ్ వ్యవస్థతో 13 ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలు సిద్ధంచేశారు. వినియోగదారులకు, ప్రజావాణి, 1912 టోల్ ఫ్రీ నంబర్లు వాడుకోవాలని సూచించారు.