NZB: TU పరిధిలోని 25 పీజీ కోర్సుల మూడవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఉపకులపతి ప్రొఫెసర్ టి. యాదగిరి రావు శనివారం విడుదల చేశారు. ఈ ఫలితాలను విద్యార్థుల సౌకర్యార్థం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు రిజిస్ట్రార్ ఆచార్య సంపత్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్, ఇతర యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.