WNP: రాష్ట్రంలో ఆడపిల్లల భద్రత ప్రమాదంలో పడుతోందని హిందూ వాహిని కన్వీనర్ అభిలాష్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో పర్యవేక్షణ లోపం, పాఠశాలల్లో సీసీ కెమెరాలు లేకపోవడం వల్లే అఘాయిత్యాలు పెరుగుతున్నాయని విమర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.